తిరుపతిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఆపరేషన్ త్రిశూల్ అవగాహన సదస్సు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. మహిళలు, బాలికల భద్రతతో పాటు నేరాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని స్థానిక ప్రజలకు పోలీసులు తగిన చైతన్యం కల్పించారు.