వినాయక నిమజ్జనంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్సై ఉదయ్ కిరణ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో నిర్వాహకులు మరియు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కోసం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. శోభాయాత్ర ఊరేగింపుల్లో డీజేల వినియోగానికి ఎలాంటి అనుమతులూ లేవని ఎస్సై స్పష్టం చేశారు. మార్గమధ్యంలో విద్యుత్ తీగలు, చెట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా పోలీసు శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.