పాకిస్థాన్‌లోని మసీదు వద్ద ఆత్మాహుతి దాడిలో ఇరవై ఒక్క మంది మృతి

రిపోర్టర్: హరి స్థలం: పాకిస్థాన్

పాకిస్థాన్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ కోహాట్ జిల్లాలోని పోలీస్ లైన్స్ సమీప మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులతో సహా మొత్తం 21 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది.