రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Madanapalle

రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరగనున్న కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ బృహత్ ప్రణాళిక ద్వారా సుమారు తొమ్మిది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని అధికారులు స్పష్టం చేశారు.