పాత విధానాలను సమూలంగా మార్చాలని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
ప్రభుత్వ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, ఉద్యోగులు నిరంతరం నైపుణ్యాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మిషన్ కర్మయోగి దక్షిణాది సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాలని కోరారు. ఐగాట్ కర్మయోగిలో విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకత్వాన్ని భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఉద్యోగుల సమగ్ర సామర్థ్య పెంపు పర్యావరణ వ్యవస్థను ప్రధాని మోదీ సృష్టించారని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు.