తెలంగాణలో చేయూత కొత్త పెన్షన్ల క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల 25లోపు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేలా, కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితా సిద్ధం చేయనున్నారు. అనర్హులకు తావులేకుండా ఈ పరిశీలన కొనసాగుతోంది.