ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్పై సుప్రీంకోర్టులో పిటిషన్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఎన్నికల సంఘం నిర్ణయాల ప్రక్రియపై వివాదం చెలరేగిన తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇతర ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని అడ్వకేట్ శైలంద్ర మని త్రిపాఠీ పిటిషన్లో ఆరోపించారు. ఓటరు జాబితా నుంచి కోట్ల పేర్ల తొలగింపుపై సిట్ దర్యాప్తు జరిపించాలని, అసలైన ఫారం ఆరును పునరుద్ధరించాలని పిటిషన్లో కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.