నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం వందలాది మంది సిబ్బందిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.