పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి విరుచుకుపడ్డారు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: చండీగఢ్

పంజాబ్ లో జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాన్ పార్లమెంట్ లో ఉన్న సమయంలో ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేదని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నివారణలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా దివంగ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను రాహుల్ గుర్తుచేసుకున్నారు.