డక్కిలి మండలంలో విస్తృతంగా గడప గడపకూ సాగిన వైఎస్సార్సీపీ ప్రచారం

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి రాపూరు మహేష్ అలాగే మండల అధ్యక్షులు చింతల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో రంగనాయుడుపల్లి, మాటుమడుగు, మోపూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ప్రతి గడపకూ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్ని వేళలా అందుబాటులో ఉంటామని నాయకులు భరోసా కల్పించారు.