ఆఫ్ఘానిస్తాన్‌తో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
అరున్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం విశేషం. జట్టు కూర్పు దృష్ట్యానే ఈ మార్పులు చేసినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశారు.