శబరిమలలో బంగారు కిరీటం మాయం ప్రచారం అవాస్తవమన్న కమిషనర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: శబరిమల

శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయమైందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తిరువాభరణం కమిషనర్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్లో తనిఖీల సమయంలో డమ్మీ కిరీటాల వల్ల ఈ గందరగోళం తలెత్తిందని, అసలైన బంగారు కిరీటం సన్నిధానంలోని స్ట్రాంగ్ రూమ్లోనే అత్యంత సురక్షితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అక్కడ విలువైన ఆభరణాల సమగ్ర తనిఖీలు కొనసాగుతున్నాయి.