హైదరాబాద్ హనీట్రాప్ కేసులో కలకలం: నిందితుడి ఖాతాలు సీజ్ చేసిన పోలీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నిందితుడు పవన్ కుమార్కు నవంబర్ 2 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతడికి సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో పాటు, రెండు లక్షల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా సుమారు వెయ్యి మందిని ట్రాప్ చేసినట్లు గుర్తించి విచారణ ముమ్మరం చేశారు.