సరిహద్దులో చైనా బలగాల మోహరింపు తగ్గింది: రక్షణ శాఖ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
భారత్-చైనా సరిహద్దు వెంబడి వాస్తవాధీన రేఖ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మోహరింపు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. 2024 ఒప్పందం తర్వాత దెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాలలో డ్రాగన్ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఉత్తర సరిహద్దులో పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉందని, భారత్ పూర్తి అప్రమత్తతతో కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది.