టాలీవుడ్ లో జోరుగా మహేష్ బాబు తదుపరి సినిమా చర్చలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందని సినీ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుతం ఎస్ .ఎస్ . రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఆయన కాంబినేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.