'లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం': గ్రామసేవా ఇనాం భూముల ఫ్రీహోల్డ్‌పై ప్రభుత్వం నిర్ణయం
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతించడంతో పాటు 1.36 లక్షల ఎకరాల గ్రామ సేవా ఇనాం భూముల నిషేధాన్ని ఎత్తివేసింది. అమరావతిలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లో ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డులను సవరించాలని అధికారులను ఆదేశించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన 3.63 లక్షల ఎకరాలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.