రాష్ట్రంలో 770 మంది హస్తకళాకారులకు ప్రత్యేక శిక్షణ, ఆర్థిక భరోసా
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని హస్తకళాకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. రూ.1.35 కోట్ల వ్యయంతో 770 మంది కళాకారులకు ఆధునిక డిజైన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లోని 200 మందికి టూల్ కిట్లు అందజేస్తామని మంత్రి సవిత ప్రకటించారు. సంప్రదాయ కళలకు జాతీయ గుర్తింపు తెచ్చి, కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.