క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్ 2027: దేశంలోనే మొదటి స్థానంలో ఐఐటీ దిల్లీ

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్ 2027 విడుదల కాగా, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ దిల్లీ ఆసియా స్థాయిలో అరవై ఆరో స్థానాన్ని దక్కించుకుంది. చైనా తర్వాత ఆసియాలో అత్యధిక విశ్వవిద్యాలయాలతో భారత్ రెండో స్థానంలో నిలిచిందని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. పరిశోధన రంగంలో దేశంలోని విద్యా సంస్థలు అద్భుత ప్రతిభ కనబరిచాయని, ఎంప్లాయర్ రెప్యూటేషన్ లోనూ ఐఐటీలు మెరుగైన స్థానాలు సాధించాయని నిపుణులు వెల్లడించారు.