పాన్గల్: మహిళా అక్షరాస్యత కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక ప్రోత్సాహం
రిపోర్టర్: నరేష్
స్థలం: పాన్గల్
మహిళలు అక్షరాస్యులైనప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పాన్గల్ మండలంలో జరిగిన కార్యక్రమంలో నిరక్షరాస్య మహిళలకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. చదువు నేర్చుకునే మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ముందుగా చదవడం, రాయడం నేర్చుకున్న వారికి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని మంత్రి ప్రకటించారు.