రాప్తాడులో దారుణం: విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఉన్మాది

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైన బాధితురాలిని మంత్రి సత్యకుమార్ పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. దాడిని అడ్డుకున్న మరో విద్యార్థిని కూడా గాయపడగా, నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.