మైలవరంలో కాగడాల ర్యాలీ: మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎన్టీఆర్ పోలీసులు అవగాహన

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఎన్టీఆర్

మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ పోలీస్ ఆధ్వర్యంలో మైలవరంలో కాగడాల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించినట్లు ఎన్టీఆర్ పోలీస్ వెల్లడించారు. ఎస్.వి. రాజశేఖర బాబు సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సామాజిక అంశాలపై నినాదాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.