జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: రంగారెడ్డి
తెలంగాణలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూర్ గ్రామంలో పరిశీలించింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఇనామ్ భూములు, చెరువు కాల్వలను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్ నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.