పెళ్లి పత్రిక పేరిట సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ!

రిపోర్టర్: సురేష్ స్థలం: మహారాష్ట్ర

పుణెలో సైబర్ నేరగాళ్లు పెళ్లి పత్రిక ఏపీకే ఫైల్ పేరుతో రిటైర్డ్ ఆడిటర్ ఖాతా నుంచి రూ.2.75 లక్షలు కాజేశారు. బంధువు నంబర్‌ను పోలిన నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ను తెరిచి ఫైల్ డౌన్‌లోడ్ చేయడంతో ఫోన్ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గుర్తుతెలియని లింక్స్, ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు.