భోపాల్ లో దారుణం: భార్య, పిల్లలతో సహా నలుగురిని హతమార్చిన తండ్రి ఆత్మహత్య
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bhopal
భోపాల్ లోని ఛోలా పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో నరేంద్ర సాహు అనే వ్యక్తి తన తల్లి, భార్య మరియు ఇద్దరు పిల్లలను సుత్తెతో మోది, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నామని, అనంతరం అతడు కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు.