'ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నాం': నెల్లూరులో డీఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Nellore
నెల్లూరులో పునర్ నిర్మించిన చారిత్రాత్మక డీఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని లోకేష్ పునరుద్ఘాటించారు.