సచివాలయ ఉద్యోగులకు కొత్త జాబ్ ఛార్ట్: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించారు. ఉద్యోగులందరికీ స్పష్టమైన జాబ్ ఛార్ట్ తయారు చేయాలని, ప్రతి కార్యాలయానికి ఈవీ సైకిల్ కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో డీప్ టెక్ అమలు చేసి, ప్రజల సంతృప్తియే ప్రధాన లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు.