మురసు తుఫాన్ ముప్పుతో వేలేరుపాడు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేలేరుపాడు

వేలేరుపాడు మండలంలో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని తహశీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునిగిన రహదారులు దాటొద్దని, మట్టిగోడల ఇళ్లవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.