బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన చౌటుప్పల్ పురపాలక చైర్మన్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 12వ వార్డులో కురిసిన భారీ వర్షాలకు వరదనీరు చేరి నిత్యావసర సరుకులు కోల్పోయిన బాధిత కుటుంబాలను చైర్మన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ ఆదుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు సోమవారం రాములమ్మ, అంజమ్మ, లక్ష్మమ్మ అనే ముగ్గురు బాధితులకు స్వయంగా నిత్యావసర సరుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, కాలనీ వాసులు పాల్గొని బాధితులకు భరోసా కల్పించారు.