తోటపల్లిలో ఘనంగా వినాయక ఉత్సవాలు అన్నప్రసాద వితరణ

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు 14 రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మహమ్మద్ ఖయ్యిం మరియు బొడ్డుపల్లి నిరంజన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి ఆశీస్సులు పొందారు. యువత చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.