చట్టబద్ధమైన నిబంధనలతోనే పిల్లలను దత్తత తీసుకోవాలని స్పష్టీకరణ
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
పిల్లలను దత్తత తీసుకునేవారు కేంద్ర దత్తత వనరుల సంస్థ పోర్టల్ ద్వారా చట్టబద్ధమైన నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు సూచించారు. జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో బుధవారం దత్తత, ఫోస్టర్ కేర్ విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.