తొర్రూరు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి గుట్టురట్టు: ధ్రువీకరణ పత్రాల కోసం వసూళ్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రెవెన్యూ సేవలకు అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపించినట్లు తహసీల్దార్ గడిల శ్రీనివాస్ తెలిపారు. హరిపిరాల గ్రామానికి చెందిన జీపీఓ గాదరబోయిన అచ్చయ్య ధ్రువీకరణ పత్రాల జారీకి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. బాధితుల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు.