వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించిన విజయవాడ పోలీసులు
రిపోర్టర్: సతీష్
స్థలం: Vijayawada
డీఎస్పీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ ఈనెల 21న తలపెట్టిన వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లిన మాచవరం పోలీసులు నోటీసులు అందజేశారు. విజయవాడ నగరంలో ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.