మెగాస్టార్ 'కాకా' చిత్రంపై థమన్ అదిరిపోయే అప్‌డేట్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సెట్స్ నుంచి చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేసిన సంగీత దర్శకుడు థమన్, ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే అత్యుత్తమ సంగీతం అందిస్తున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో చిత్రంలోని పాటలు, నేపథ్య సంగీతంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.