పంతంగిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం పంతంగిలోని అక్షర ట్యూషన్ కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ట్యూషన్ చైర్మన్ బర్మా నాగరాణి, కోఆర్డినేటర్ చినుకని యువరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.