రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ లెటర్లు విడుదల

రిపోర్టర్: శివ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షల ఇంటర్వ్యూ లెటర్లను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్ఐ మొదటి విడత అలాగే గణిత విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ చివరి విడత ఇంటర్వ్యూల హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వీటిని డౌన్లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.