నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాల నామినేషన్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ఒకటీ రెండు చోట్లు మినహా అన్నిచోట్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల అభ్యర్థులు గురువారం ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అల్లర్లకు అవకాశం ఉన్న ప్రాంతాలలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి వైకాపా ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేసి గుంపులుగా రాకుండా తగు చర్యలు తీసుకున్నారు.