నీట్‌లో సత్తా చాటిన నిరుపేద ఆదివాసీ కుటుంబం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఒడిశా

ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన నిరుపేద ఆదివాసీ రైతు కుటుంబంలో ఐదుగురు అన్నాచెల్లెళ్లు నీట్‌లో ఉత్తీర్ణత సాధించి మెడిసిన్ సీట్లు దక్కించుకున్నారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి వైద్య విద్య సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.