ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో దారుణం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహా భార్య హత్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: సుల్తాన్‌పూర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లాలోని కదీపూర్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముకేష్ సింగ్, ఆయన భార్య వినిత సింగ్ హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. కుంబి దదియా గ్రామంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలో మరియు కొద్ది దూరంలో దంపతుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో కత్తి, గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వ్యక్తిగత లేదా ఆస్తి వివాదాల కోణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.