ఆలేరులో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నిమజ్జన శోభాయాత్రను శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణ పురవీధులు మార్మోగాయి. యువత, భక్తులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేయగా కమిటీ సభ్యులు బోట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.