ఏపీ విద్యా వ్యవస్థ సంస్కరణలను అభినందించిన సింగపూర్ మంత్రి షణ్ముగం
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ బలోపేతానికి సింగపూర్ దేశం పూర్తి సహకారం అందిస్తుందని ఆ దేశ హోంమంత్రి కే.షణ్ముగం స్పష్టం చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇరు దేశాల మధ్య విద్యా సంస్కరణలు, మాదకద్రవ్యాల నివారణపై కీలక చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను షణ్ముగం ప్రశంసించారని లోకేష్ పేర్కొన్నారు.