అక్టోబర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీ పెంపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల ధరలు మూడు నుంచి ఎనిమిది శాతం వరకు పెరగనున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. పండగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఏసీలు, టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్ల ధరలు ప్రింకానున్నాయి. ముడి పదార్థాల వ్యయం, రవాణా ఖర్చులు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తయారీ సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో కొనుగోలుదారుల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడనుంది.