రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లపై రవాణా శాఖ ఆకస్మిక దాడులు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లపై రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అదనపు వసూళ్లు, ఏజెంట్ల ప్రమేయంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కేంద్రాల లైసెన్సులు రద్దు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది.