హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ ప్రాజెక్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ నిర్మాణం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని, సొంత రిస్క్తో పనులు కొనసాగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు పనులు కొనసాగించుకోవచ్చని, అయితే కేవలం పెట్టుబడి పెట్టినంత మాత్రాన ఎలాంటి ప్రత్యేక హక్కులు కోరడానికి వీలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ ప్రధాన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.