ఇరాన్ సైనిక చర్యలో నాటో ప్రమేయం ఉందన్న మార్క్ రూటె
రిపోర్టర్: రాము
స్థలం: నేషనల్ బ్యూరో
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి చేపట్టిన సైనిక చర్యలో నాటో ప్రమేయం ఉందని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ మార్క్ రూటె స్పష్టం చేశారు. ఐయోవాలో జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌కు మద్దతుగా యూరప్ నుండి ఐదు వేల విమానాలు బయలుదేరి వెళ్లాయని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ మరణంతో ప్రారంభమైన ఈ యుద్ధంలో యూరప్ దేశాలు లాజిస్టికల్, సైనిక మద్దతు అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు.