సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ: అపరేష్ కుమార్ సింగ్కు భట్టి అభినందనలు
రిపోర్టర్: శివ
స్థలం: ఖమ్మం
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తెలంగాణ హైకోర్టు మాజీ ప్రధాన అపరేష్ కుమార్ సింగ్కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన శుభాకాంక్షలు వెల్లడించారు. న్యాయవ్యవస్థలో విశేష సేవలు అందించిన ఆయన సుప్రీంకోర్టులోనూ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అపరేష్ కుమార్ సింగ్ భవిష్యత్తు ప్రయాణానికి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా అభినందనలు తెలిపారు.