ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా యాభై కిలోల బియ్యం అందించాలని స్పష్టం చేశారు. పెరిగిన వరద ప్రవాహాలను వృథా చేయకుండా రిజర్వాయర్లు, చెరువులను నింపడంతో పాటు నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పులిచింతల ప్రకాశం బ్యారేజీ మధ్య కొత్త బ్యారేజీ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని చంద్రబాబు ఆదేశించారు.