రాప్తాడులో దారుణం: విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనలో మరో బాలిక కీలక విషయాలు వెల్లడించింది. నిందితుడు రంపంతో తరగతి గదిలోకి వచ్చి దాడికి యత్నించాడని ప్రత్యక్ష సాక్షైన బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన తనపై కూడా నిందితుడు దాడి చేశాడని తెలిపింది. ఈ ఘటన విద్యాసంస్థల్ లో విద్యార్థుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని స్థానికులు వాపోతున్నారు.