'ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం': పురందేశ్వరి పిలుపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఇరవై ఐదు సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని పురందేశ్వరి ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పదిహేడో తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపాన్ని వెలిగించాలని ప్రజలకు పురందేశ్వరి పిలుపునిచ్చారు. మోదీ సేవలను కొనియాడుతూ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పురందేశ్వరి కోరారు.