కేరళలో భారీ వర్షాలు, వరదల బీభత్సం తొమ్మిది మంది మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: కేరళ
కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మలప్పురం జిల్లా నిలంబూర్ లోని కొట్టప్పుజ నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరద ఉద్ధృతికి ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో నలుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తుండగా, వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.