జాతీయ రాజకీయాల్లో సంచలనం: ప్రాంతీయ కూటమి కోసం కేసీఆర్ వ్యూహాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తులను ఏకం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ పావులు కదుపుతున్నారని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వైఎస్ జగన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి ప్రాంతీయ దిగ్గజాలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.